పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో నర్సిపురం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు బర్ల సత్యం తన కుటుంబ సభ్యులతో కలిసి వైసీపీలో చేరారు. విజయదశమి సందర్భంగా గ్రామ వైసీపీ నాయకులతో కలిసి క్యాంపు కార్యాలయానికి చేరుకున్న వారికి జోగారావు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ సీనియర్ నాయకులు వైసీపీలో చేరిక


