హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుక్క అడ్డురావడంతో ఎంపీడీవోకు తీవ్ర గాయాలు

అన్నమయ్య: కొత్తకోట ఎంపీడీవో అబ్దుల్ సుకూర్ (58) బైక్‌పై విధులకు వెళ్తుండగా కురబలకోట మండలం మగసాలమర్రి వద్ద కుక్క అడ్డురావడంతో ప్రమాదానికి గురయ్యారు. బైక్ అదుపుతప్పి పడటంతో తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.