CTR: విజయదశమి సందర్భంగా చిత్తూరు జిల్లా ఎ. ఆర్. పెరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో ఆయుధ పూజ నిర్వహించారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ప్రథమ ధ్యేయమని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ దసరా పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా ఆయుధ పూజ


