హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడ నుంచి తిరుపతికి గుండె తరలింపు

TPT: విజయవాడ నుంచి ప్రత్యేక ఫ్లై91 విమానంలో తీసుకొచ్చిన గుండె రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి పోలీసులు గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేసి, కట్టుదిట్టమైన భద్రత మధ్య రోడ్డు మార్గంలో తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో గుండెను నిర్ణీత సమయంలో ఆసుపత్రికి చేర్చారు.