PPM: సార్వత్రిక విద్యాపీఠంలో పదో తరగతి, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశ గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు డీఈవో బ్రహ్మాజీరావు తెలిపారు. ఎటువంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 14 ఏళ్లు నిండిన వారు, పదో తరగతి ఉత్తీర్ణులు ఇంటర్‌లో చేరవచ్చని పేర్కొన్నారు. మధ్యలో చదువు మానేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఇంటర్ కోర్సుల్లో ప్రవేశ గడువు పెంపు


