సత్యసాయి: స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రామగిరి పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రౌడీషీటర్లు, అనుమానితులు సహా 153 మందిని గుర్తించి, ఇప్పటివరకు 100 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎస్సై ప్రదీప్ రాజ్ తెలిపారు. తహశీల్దార్ ఎదుట హాజరుపరిచి వారి నుంచి ఆరు నెలల కాలపరిమితితో హామీ పత్రాలు రాయించుకుని విడుదల చేసినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
రామగిరిలో 100 మందిపై బైండోవర్ కేసులు


