NDL: కొత్తపల్లె మండలం ముసలిమడుగులో అంకాలమ్మ దేవాలయానికి వెళ్లే దారిలో దెబ్బతిన్న కుళాయిల నుంచి మంచినీరు వృథాగా పోతోంది. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో నీటి ఎద్దడి ముప్పు ఉన్నందున నీటి వృథాను అరికట్టాలని, అధికారులు వెంటనే స్పందించి కుళాయిలకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
మరమ్మతులు లేని కుళాయిలతో మంచినీరు వృథా


