NLR: కోవూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం నాయకులతో కలిసి పోటీ చేస్తామని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు. బుచ్చిలోని వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. పొత్తులో భాగంగా విడవలూరు బిట్-1, దామరమడుగు బిట్-1, 2 స్థానాలను సీపీఎంకు కేటాయించినట్లు వెల్లడించారు. పెనుబల్లి సర్పంచ్ అభ్యర్థి కూడా సీపీఎం నుంచే ఉంటారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక సంస్థ ఎన్నికల్లో సీపీఎంతో కలిసి నడుస్తాం'


