హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీటీసీ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా సాయి లక్ష్మి

TPT: వరదయ్యపాలెం మండల జడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సత్యవేడు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కే. సాయి లక్ష్మి పోటీ చేయనున్నారు. ఈ మేరకు తిరుపతి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలగురువం బాబు చేతుల మీదుగా పార్టీ బీ-ఫామ్ అందుకున్నారు. మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని సాయి లక్ష్మి తెలిపారు.