హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతలపై సస్పెన్షన్ ఎత్తివేత

PLD: వినుకొండ నియోజకవర్గంలో వైసీపీకి చెందిన మాజీ ఎంపీపీ చుండూరి వెంకటేశ్వర్లు, ఉప్పలపాడు మాజీ వైస్ సర్పంచ్ నక్క నాగిరెడ్డిలపై గతంలో ఉన్న సస్పెన్షన్‌ను పార్టీ కేంద్ర కార్యాలయం ఎత్తివేసింది. వారు యథావిధిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అధిష్ఠానం సూచించింది. ఈ నిర్ణయాన్ని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్వాగతించారు.