హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారు

కోనసీమ: అమలాపురం పట్టణం శ్రీదేవి మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీదేవి అమ్మవారిని నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మంగళవారం రాజరాజేశ్వరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ జరుగుతున్న హోమగుండం వద్ద ప్రదక్షిణలు చేసి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.