ఎముకలు గుల్లబారి బలహీనపడే వ్యాధి 'ఆస్టియోపొరోసిస్'. దీని నివారణ, చికిత్సపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా అక్టోబర్ 20న 'ప్రపంచ ఆస్టియోపొరోసిస్ దినోత్సవం' జరుపుకుంటారు. వయసు పెరిగేకొద్దీ, ముఖ్యంగా మహిళల్లో ఈ ఎముకల క్షీణత సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కాల్షియం, విటమిన్-డి ఉండే ఆహారం తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఎముకలను దృఢంగా ఉంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
ఆరోగ్యం
ఎముకలు గుల్లబారకుండా ఉండాలంటే?


