హైదరాబాద్: 28°C
తెలంగాణ

టిప్పర్లతో మట్టి దందా

NGKL: వెల్దండ మండలంలో ప్రభుత్వ గుట్టల నుంచి అనుమతులు లేకుండా మట్టిని టిప్పర్ల ద్వారా తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో టిప్పర్‌ మట్టిని రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. కల్వకుర్తికి చెందిన కొందరు వ్యాపారులు ఈ దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.