రంజీ ట్రోఫీలో భాగంగా హిమాచల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో చెలరేగాడు. 213 బంతుల్లో 18 ఫోర్లతో 139* పరుగులు చేశాడు. సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ (57) కూడా హాఫ్ సెంచరీ చేశాడు. సిద్ధేశ్ లాడ్ (87) రాణించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 4 వికెట్లకు 398 పరుగులు చేసి 258 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
క్రీడలు
సెంచరీతో చెలరేగిన సర్ఫరాజ్


