హైదరాబాద్: 28°C
క్రీడలు

రజత్ పాటిదార్ మెరుపు సెంచరీ

రంజీ ట్రోఫీలో పుదుచ్చేరితో జరుగుతున్న మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ కెప్టెన్ రజత్ పాటిదార్ (107*) మెరుపు శతకంతో చెలరేగాడు. చంచల్ రాథోడ్ (78), శుభమ్ శర్మ (78) కూడా రాణించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్ 5 వికెట్లకు 302 పరుగులు చేసి 125 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. పాటిదార్‌కు జతగా అథర్వ్ మహాజన్ (32) క్రీజ్‌లో ఉన్నారు.