హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురం మేయర్ నామినేషన్ల పరిశీలన పూర్తి

ATP: అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. ఈ ఎన్నికల్లో 16 నామినేషన్లు దాఖలు కాగా, ఒక్కటీ తిరస్కరించలేదని అధికారులు తెలిపారు. పరిశీలన అనంతరం 16 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు తేలిందని వెల్లడించారు. ఇందులో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.