హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరెన్సీతో అమ్మవారి అలంకరణ

VSP: దసరా సంబరాలు సమైక్యతకు సాధనాలని నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి పేర్కొన్నారు. సీతమ్మధార ఏపీఎస్‌ఈబీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దైవ, దేశభక్తితో జీవిస్తే జీవితంలో సత్ఫలితాలు సాధించవచ్చన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని సుమారు రూ.10 లక్షల కరెన్సీతో అలంకరించారు.