హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కఠిన చర్యలు తప్పవు'

VZM: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ సూచించారు. కులం, మతం, ప్రాంతం, భాష ఆధారంగా ఓట్లు అడగడం, ప్రజల మధ్య విభేదాలు, విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడడం, ప్రచారం చేయడం చేయరాదన్నారు. డబ్బు, మద్యం, బహుమతులు లేదా ఇతర ప్రలోభాలను ఓటర్లకు అందించడం పూర్తిగా నిషేధమన్నారు.