GNTR: పొన్నూరు 9వ వార్డు రైలుపేటలో రెల్లి యూత్ టీమ్ ఆధ్వర్యంలో దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఈ వేడుకలు మతసామరస్యం, సోదరభావం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటేనని, పండుగలు అందరినీ ఐక్యంగా ఉంచుతాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైలుపేటలో ఘనంగా దసరా నవరాత్రి వేడుకలు


