హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ బస్సుకు ఊడిన అద్దం

ELR: సత్రంపాడు సెంటర్ వద్ద ఏలూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ హైయర్ బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద బ్రేక్ వేయడంతో ముందున్న విండ్ షీల్డ్ ఊడి కిందపడింది. రద్దీ ప్రాంతంలో అద్దం పడటంతో వాహనదారులు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అద్దె బస్సుల నిర్వహణ గాలికొదిలేశారని స్థానికులు మండిపడుతున్నారు.