PLD: సత్తెనపల్లి మున్సిపల్ ఛైర్మన్ నామినేషన్ల పరిశీలనలో సందిగ్ధత నెలకొంది. వైసీపీ అభ్యర్థి షేక్ నాగుల్ మీరాన్ పేరిట రేషన్ షాపు ఉందని టీడీపీ, అలాగే టీడీపీ అభ్యర్థి మారెళ్ల రామాంజనేయులుకు మున్సిపల్ సర్వేయర్ లైసెన్స్ ఉందని వైసీపీ అభ్యంతరం తెలిపాయి. పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల అధికారి ఇరువురి నామినేషన్లను ప్రస్తుతం పెండింగ్లో పెట్టారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ల పరిశీలనలో సందిగ్ధత


