హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా దసరా సంబరాలు

కోనసీమ: మండపేట సెక్టార్ పరిధిలోని రావులపేట జనార్ధన స్కూల్ అంగన్వాడీ కేంద్రంలో టీచర్ సీహెచ్ శ్రీ వరలక్ష్మి ఆధ్వర్యంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో హెల్పర్ కనకమహాలక్ష్మి, చిన్నారులు, తల్లులు ఉత్సాహంగా పాల్గొనగా, దుర్గాదేవి వేషధారణలో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దసరా ప్రతీక అని పేర్కొన్నారు.