హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐక్యవేదిక జిల్లా కోశాధికారిగా రాము ఏకగ్రీవం

SKLM: విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక జిల్లా కోశాధికారిగా ఎల్.ఎన్.పేట మండలానికి చెందిన మండరాడ రాము ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. సోమవారం జిల్లా అధ్యక్షుడు యడ్ల గోపి ఈ విషయాన్ని ప్రకటించారు. దళిత ఉద్యమాలకు రాము విశేష సేవలందిస్తున్నారని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనకు అంకితభావంతో పనిచేస్తానని రాము తెలిపారు.