హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CMRF చెక్కు అందించిన మదనపల్లె MLA

అన్నమయ్య: మదనపల్లె మండలంలోని వేంపల్లి హరిజనవాడకు చెందిన పదేళ్ల చిన్నారి వినయు వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ. 3 లక్షల CMRF చెక్కును MLA షాజహాన్ బాషా సోమవారం అందజేశారు. మూడు నెలల క్రితం రూ. 8 లక్షలు మంజూరు కాగా, తాజాగా మరో రూ. 3 లక్షలు విడుదలయ్యాయి. MLA నివాసంలో జిల్లా TDP అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్బాబు ఆధ్వర్యంలో చిన్నారి కుటుంబానికి చెక్కును అందించారు.