హైదరాబాద్: 28°C
క్రీడలు

బీసీసీఐ కొత్త చీఫ్ సెలెక్టర్ ఎవరంటే?

టీమిండియా కొత్త చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజాను బీసీసీఐ నియమించింది. వెస్ట్ జోన్ తరఫున సెలెక్టర్‌గా రమేష్ పొవార్‌ను ఎంపిక చేసింది. కాగా, అజిత్ అగార్కర్ పదవి నుంచి తప్పుకోవడంతో బీసీసీఐ తాత్కాలిక చీఫ్ సెలెక్టర్‌గా ఓజా ఇప్పటికే బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తాజా నియామకంతో పూర్తి స్థాయి చీఫ్ సెలెక్టర్‌గా ఓజా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.