హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొండవీడు కోటలో ట్రెక్కింగ్

PLD: చారిత్రక కొండవీడు కోటలో ట్రెక్కింగ్ కార్యక్రమం ఉత్సాహభరితంగా నిర్వహించారు. టెన్ ఆంధ్ర గర్ల్స్ ఎన్‌సీసీ బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 250 మంది ఎన్‌సీసీ విద్యార్థినులు పాల్గొన్నారు. కొండవీడు కోట చారిత్రక ప్రాధాన్యతను తెలుసుకోవడంతో పాటు, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ట్రెక్కింగ్ నిర్వహించారు.