హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలి: పీలేరు RO

అన్నమయ్య: MPTC ఎన్నికలు యుద్ధ వాతావరణంలో కాకుండా ప్రజాస్వామ్య పండుగలా ప్రశాంతంగా జరగాలని పీలేరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి. శ్రీనివాసులు నాయుడు సూచించారు. ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు, చట్టానికి అనుగుణంగా నిర్వహించాలన్నారు. నామినేషన్ కేంద్రం వద్ద 100 మీటర్ల పరిధి నిబంధన పాటించాలని తెలిపారు.