ATP: జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆయుధ పూజ ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ జగదీష్ దుర్గామాత ప్రతిమకు ప్రత్యేక పూజలు చేశారు. ఆయుధాగారంలోని ఆయుధాలకు, మోటారు ట్రాన్సుపోర్ట్ విభాగంలోని వాహనాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ప్రజలు, పోలీసులు సుఖసంతోషాలతో ఉండాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఘనంగా ఆయుధ పూజ


