హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీటీసీ నామినేషన్లకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జడ్పీటీసీ నామినేషన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ జీ.రాజకుమారి పరిశీలించారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్‌ కేంద్రానికి 100 మీటర్ల వెలుపల వాహనాల పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.