ELR: ద్వారకాతిరుమల మండలం జి. కొత్తపల్లిలో సోమవారం పోలీసులు ఎన్నికల అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, రాజకీయ విభేదాలతో గొడవలకు దిగవద్దని భీమడోలు సీఐ కృష్ణ, ఎస్సై సుధీర్ సూచించారు. ఓటర్‌లను ప్రలోభపెట్టినా, అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలంతా సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
జి.కొత్తపల్లిలో ఎన్నికల సదస్సు


