హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ల బందోబస్తుపై ఎస్సై పరిశీలన

GNTR: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను చందోలు ఎస్సై మాధవరావు సోమవారం పరిశీలించారు. పిట్టలవానిపాలెం ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి బందోబస్తుపై సమీక్షించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.