హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లారీల దుమ్ముతో తాడేపల్లి విలవిల

NTR: విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి మీదుగా విజయవాడ వెళ్లే దారిలో భారీ లారీలతో దుమ్ము కమ్ముకుంది. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దుమ్ముతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై నీళ్లు చల్లి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.