హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాఫీ కార్మికుల పిల్లలకు ప్రోత్సాహకం

ASR: కాఫీ కార్మికుల పిల్లలకు కాఫీ బోర్డు ఆర్థిక సాయం అందించనుందని మినుములూరు సీనియర్ లైజన్ ఆఫీసర్ సమల రమేష్ తెలిపారు. ఈ మేరకు 2026-27 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానించారు. ఎస్సీ, ఎస్టీ కార్మికుల మొదటి ఇద్దరు పిల్లలు అర్హులన్నారు. డిగ్రీకి రూ.7,500, పీజీకి రూ.15,000, వైద్య, వృత్తి విద్యకు రూ.20,000 అందిస్తారని తెలిపారు. నవంబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.