VZM: విజయనగరం కార్పొరేషన్, నెల్లిమర్లలో ఎన్నికల సాధారణ పరిశీలకుడు తేజ్ భరత్ సోమవారం విస్తృతంగా పర్యటించారు. నెల్లిమర్లలోని మొయిద జంక్షన్ వద్ద నిఘా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు, నామినేషన్ల పరిశీలన ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల నిబంధనలు పక్కాగా అమలు చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకుడి తనిఖీలు


