హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా నామినేషన్ల పరిశీలన

CTR: పుంగనూరులో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని 36 వార్డులకు మొత్తం 109 నామినేషన్లు దాఖలయ్యాయి. చైర్‌పర్సన్ పదవికి 8 నామినేషన్లు అందాయి. కూటమి అభ్యర్థులతో పాటు ఎస్‌డీపీఐ నుంచి ఒకరు, సీపీఐ నుంచి ఒకరు, ఇతరుల నుంచి నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల సమక్షంలో అధికారులు నామినేషన్లను పరిశీలించారు.