హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీలోకి భారీగా చేరికలు

NDL: నంద్యాల పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో సోమవారం మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో 52వ వార్డ్ టీడీపీ ఇంఛార్జి శివనాగిరెడ్డి తన అనుచరులతో కలిసి టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు. ఆయనతో 50 కుటుంబాలు వైసీపీ గూటికి చేరారు. శిల్పా మోహన్ రెడ్డి వారికి వైసీపీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారికి అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు.