హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

SKLM: నందిగాం మండలం ఉయ్యాలపేట గ్రామానికి చెందిన 15 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. నిమ్మాడలో సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.