హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీకి షాక్.. వైసీపీలోకి చేరికలు

NDL: సిరివెళ్ల మండలం ఇసుక పల్లి గ్రామంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు స్థానిక వైసీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి తన అనుచరుల 10 కుటుంబాలతో కలిసి గంగుల సమక్షంలో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు. పార్టీలో సముచిత ప్రాధాన్యం ఉంటుందని గంగుల తెలిపారు.