హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్!

SRCL: సిరిసిల్ల పట్టణంలోని 39వ వార్డులో శ్రీ కంచి కామాక్షి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులు పాల్గొన్నారు. అనంతరం అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజకు ముందస్తు దసరా శుభాకాంక్షలు తెలిపారు.