హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల వేళ మద్యం దుకాణాలు బంద్

GNTR: తెనాలిలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ముగియడానికి ముందు 48 గంటల పాటు, ఓట్ల లెక్కింపు రోజున మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేయాలని కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదేశించారు. నిబంధనలు పక్కాగా అమలయ్యేలా రెవెన్యూ, ఎక్సైజ్, పోలీసు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆయన సూచించారు.