హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాటసాని సమక్షంలో వైసీపీలోకి చేరికలు

KRNL: ఓర్వకల్లు మండలం లొద్దిపల్లెలో టీడీపీకి చెందిన 30 కుటుంబాలు వైసీపీలో చేరాయి. నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్‌రెడ్డి, కాటసాని శివ నరసింహారెడ్డి సమక్షంలో సోమవారం ఈ చేరికలు జరిగాయి. రామభూపాల్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు. పార్టీలో సముచిత గౌరవం కల్పిస్తామని కాటసాని తెలిపారు.