హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్‌నినో ప్రభావం.. ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం

JN: ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలున్నందున యాసంగి 2026–27లో ఆరుతడి పంటలు సాగు చేయాలని తరిగొప్పుల మండల వ్యవసాయ అధికారి మురళి బాబు రైతులకు సోమవారం సూచించారు. వేరుశనగ, పెసర, శనగ, కుసుమ, నువ్వులు వంటి పంటలను ప్రోత్సహించాలని విత్తన డీలర్ల సమావేశంలో తెలిపారు. నాణ్యమైన విత్తనాలు విక్రయిస్తూ, తప్పనిసరిగా ఇవ్వాలని డీలర్లకు తెలిపారు.