హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యాటక కేంద్రంగా మెదక్‌కు గుర్తింపు

MDK: జిల్లాలో చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాలు, ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రసిద్ధ మెదక్ చర్చి, ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయం, పోచారం వన్యప్రాణుల అభయారణ్యం సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పర్యాటక సౌకర్యాలను మెరుగుపరిచి, ప్రచారం పెంచితే జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి చెంది.. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.