హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మహాపూర్ణాహుతితో ముగిసిన నవరాత్రి పూజలు

HNK: శ్రీ హనుమద్గారి పద్మాక్షి దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం తొమ్మిదో రోజు అమ్మవారు సిద్ధిధాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహాపూర్ణాహుతి నిర్వహించి, భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. సిద్ధిధాత్రి అమ్మవారిని ఆరాధిస్తే సకల సిద్ధులు, మనోరథాలు నెరవేరుతాయని అర్చకులు శంకర్ తెలిపారు.