హైదరాబాద్: 28°C
తెలంగాణ

బెల్లంపల్లి ప్రజావాణిలో దరఖాస్తులు నిల్

MNCL: బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఒక్క దరఖాస్తు కూడా రాలేదని ఎంపీడీవో మహేందర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో 16 మంది అధికారులు హాజరయ్యారని తెలిపారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగ కారణంగా దరఖాస్తులు రాలేదని తెలుస్తోంది.