NLG: జిల్లాలో వెట్టిచాకిరిని నిర్మూలించేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ వద్ద కార్మిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన స్వేచ్ఛ రథాన్ని ప్రారంభించారు. ఈ రథం 20 రోజుల పాటు జిల్లాలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, గ్రామాల్లో అవగాహన కల్పించనుంది. వెట్టిచాకిరిపై సమాచారం ఉంటే తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.
తెలంగాణ
వెట్టిచాకిరి నిర్మూలనకు సమిష్టి కృషి


