హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

MLG: ములుగు (M) బండారుపల్లిలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు భక్తిభావంతో కొనసాగుతున్నాయి. మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకి సేవ చేపట్టారు. గ్రామ వీధుల్లో సాగిన ఊరేగింపులో భక్తులు నీరాజనాలు పలుకుతూ, మంగళహారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టారు. మహిళల భక్తి పారవశ్యంతో వేడుకలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.