హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పిల్ల సూర్యనారాయణ

KKD: గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పిల్ల సూర్యనారాయణ అలియాస్ దేవుడును ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రకటించారు. జగ్గంపేట మండలం ఇర్రిపాకలోని ఎమ్మెల్యే స్వగృహంలో కూటమి పార్టీల తరఫున అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. కూటమి నాయకులతో కలిసి, కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని సూర్యనారాయణ అన్నారు.