హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రజా సమస్యలపై సీపీఐ పోరుబాట

NZB: అమరచింత మున్సిపాలిటీలోని పలు వార్డుల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ సోమవారం పోరుబాట నిర్వహించింది. 10వ వార్డులో పర్యటించిన నాయకులు, కందకంలోని మురుగునీటితో డెంగీ జ్వరాలు వ్యాపిస్తున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని సీపీఐ మండల కార్యదర్శి అబ్రహం మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు.