KMM: వ్యవసాయానికి విద్యుత్ కోతలు విధించడాన్ని నిరసిస్తూ BJP జిల్లా నాయకులు సోమవారం ఖమ్మం విద్యుత శాఖ ఎస్ఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. విద్యుత్ కోతలతో పంటలకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని, రైతులకు సాగు అవసరాల కోసం నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు.
తెలంగాణ
వ్యవసాయ విద్యుత్ కోతలపై బీజేపీ ధర్నా


